Thursday, November 16, 2017

చందమామ పుస్తకాలు డౌన్లోడ్ చేసుకోవటం ఎలా

చిన్నక్క: ఏం ఏకాంబరం ఏంచేస్తున్నావేమిటి? 

ఏకాంబరం: ఆ ఏముంది చిన్నక్కా, ఏదో ఉబుసుపోక పాత చందమామ కధలు చదువుతున్నాను


చిన్నక్క: నీకేం ఏకాంబరం, చందమామ పుస్తకాలు చక్కగా సేకరించి దాచిపెట్టుకున్నావు, చదువుకుంటావు, మాకెక్కడ దొరుకుతాయి చెప్పు 

ఏకాంబరం: అదేంటి చిన్నక్కా ఇంటర్నెట్లో ఎక్కడ బడితే అక్కడ దొరుకుతాయిగా 

చిన్నక్క: ఏంటి దొరికేది, అవన్నీ లింకులు పనిచేయటంలేదు 

ఏకాంబరం: అదేంటి చిన్నక్కా, ఇప్పుడు చందమామ వాళ్ళే పాత చందమామలు నెట్లో చదువుకోవటానికి అవకాశం కల్పిస్తున్నారు 

చిన్నక్క: నాకు తెలియదు ఏకాంబరం, ఎక్కడో చెప్పావు కాదు 

ఏకాంబరం: ఇదిగో ఇది లింకు


చిన్నక్క: అబ్బ ఎన్ని చందమామలో 

ఏకాంబరం: ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో లభ్యమవుతున్నాయి 

చిన్నక్క: ఇంతకీ ఇవి డౌన్లోడ్ చేసుకోవచ్చా ఏకాంబరం 

ఏకాంబరం: కావాలనుకుంటే చేసుకోవచ్చు 

చిన్నక్క: మరి ఎలాగో చెప్పావు కాదు 

ఏకాంబరం: ముందుగా కావల్సిన సంవత్సరాలమీద క్లిక్ చేస్తే ఇలాగున కన్పిస్తాయి 



చిన్నక్క: కావల్సిన నెల మీద క్లిక్ చేస్తే చాలనుకుంటాను 

ఏకాంబరం: అలాచేస్తే పుస్తకం అక్కడే ఓపెన్ అవుతుంది చదువుకోటానికి 

చిన్నక్క: మరి డౌన్లోడో 

ఏకాంబరం: దానికే వస్తున్నా, ఆ కనబడే నెలమీద రైట్ క్లిక్ చేసి “Save Link As” మీద క్లిక్ చేసి మన కంప్యూటర్లోకి ఎక్కడ సేవ్ చేసుకోవాలో అక్కడకి పాత్ ఇస్తే, ఠపీమని డౌన్లోడ్ అవుతుంది, అదిగూడా పి.డి.ఎఫ్. ఫార్మాట్లో. 






చిన్నక్క: చాలా బావుంది ఏకాంబరం 

ఏకాంబరం: ఇక్కడ పొరపాటున ఒకటే సంచికని, అయిదారు నెలలకు లింకు ఇచ్చారు, దానివల్ల అదే పుస్తకం డౌన్లోడ్ అవుతుంది. 

చిన్నక్క: ఇహ చూసుకో ఏకాబరం, మొత్తం డౌన్లోడ్ చేసేసుకొని నా టాబ్లెట్లో వేసుకొని చక్కగా ప్రయాణాల్లోకూడా చదువుకుంటాను, 

ఏకాంబరం: పెద్ద, మొత్తం చదివేదాన్లాగా చెబుతున్నావు, మా చిన్నక్కను ఏదివచ్చినా పట్టలేము, ఒకటే ఆరాటం 

చిన్నక్క: ఏది ఏమైనా మంచి విషయం చెప్పావు ఏకాంబరం, వుంటానూ ఇహ ఇదేపని 

ఏకాంబరం: సంతోషం 

Tabs: Chandamama

No comments:

Post a Comment