Thursday, May 19, 2016

అలనాటి అందాలు – పాత క్యాసెట్లు

సాంకేతికంగా వస్తున్న మార్పులతో ఆడియో క్యాసెట్లు కూడా ఎల్.పి. రికార్డుల మార్గాన్నే అనుసరించాయి. అయితే ఆడియో క్యాసెట్లు చాలా తక్కువ వ్యవధిలోనే కనుమరుగైపోయాయి. ఆ లెక్కన ఎల్.పి. రికార్డులకు ఇంకా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదనే చెప్పాలి. కొన్ని పాత క్యాసెట్లలో ఉన్న సమాచారాన్ని వెలుగులోకి తెచ్చే క్రమంలో భాగమే ఈ పోస్టింగ్. దాదాపు ౩౦ ఏళ్ళ కిందట శ్రీ వి.ఎ.కె. రంగారావు గారి ఆధ్వర్యంలో హెచ్.ఎం.వి. వారు అలనాటి అందాలు అన్న టైటిల్ తో ఒక నాలుగు క్యాసెట్లు తీసుకువచ్చారు. అయితే వీటికంటే ముందే ఇదే టైటిల్ తో వచ్చిన మొదటి సంకలనం తాలూకు రికార్డు యొక్క కవర్ ఫోటో ఒకటి రంగారావు గారి “మరో ఆలాపన” పుస్తకంలో ప్రచురించారు.


























కొన్ని పాటలు వినంగాన్లే మదిని దోచుకుంటే, కొన్ని వినగా వినగా హత్తుకుంటాయి. కొంతమందికి కొన్ని పాటలే తెలిసివుంటాయి, వాటినే వింటూవుంటారు గాని, అసలు ఎన్నడూ విననటువంటి పాటలజోలికి పోరు. ఇప్పుడంటే ఇంటర్నెట్ లో అన్ని పాటలు లభిస్తున్నాయికాని, ఇదివరకు ఇలా అరుదుగా వచ్చే క్యాసేట్లే ఆధారం. కొంతమందికి మాత్రమే వాటిని భద్రపరచాలన్న ఆసక్తి వుంటుంది. చాలామంది వినిపారేస్తూవుంటారు. కొన్ని జాగ్రత్తలు వహిస్తే ఇదిగో ఇప్పటికి కూడా ఆ అలనాటి అందాలను ఆనందించవచ్చు. 






ఈ మధ్య శ్రీ కె.వి.రావు గారు ఆడియో రంగంలో వచ్చిన మార్పులను విశదీకరిస్తూ “సంగీత ప్రపంచం” పేరుతో ఓ పుస్తకం తెచ్చారు. అంతకు ముందు హెచ్.ఎం.వి. సంస్థలో చిరకాలం పనిచేసి అనేక రికార్డులను పరిచయంచేసిన శ్రీ పుట్టా మంగపతి గారు “స్వరసేవ” అన్న పుస్తకం ద్వారా తమ అనుభవాలను పంచుకున్నారు. 









ఇంతకు ముందు వీటిల్లో పాటలు కొన్ని పోస్ట్ చెయ్యటం జరిగింది. వీటిల్లో చాలా పాటలు ఇంటర్నెట్ లో లభిస్తూనే వున్నాయి. చివరగా బాలసరస్వతీదేవి గారు పాడిన “తిన్నెమీది సిన్నోడ వన్నెకాడ” పాట విందాము. కింద పోస్ట్ చేసిన మూడు పాటలు నాగయ్య గారి “భాగ్యలక్ష్మి” సినిమాలోనివి.  


...







Tags: Alanaati Andalu, Nagayya, Kannamba, T. Suryakumari, Bhanumathi, R. Balasaraswathidevi, Thinnemeedi chinnoda, Bhagyalakshmi

No comments:

Post a Comment