Thursday, March 31, 2016

మనదేశభక్తులు – దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు

ఈ నూతన శీర్షిక కింద “గోపాల కిట్టాయి కొక్కిరాయి” అంటూ శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి గురించి ఆంధ్రప్రభ వారి ప్రత్యేక సంచిక “స్వర్ణప్రభ” లో వచ్చిన ఆసక్తికర విశేషాలతో కూడిన ఒక వ్యాసం, మరి ఆయన దీవెనలందుకున్న కొంతమంది దేశభక్తుల అరుదైన ఫోటోలు చూద్దాము. 





































Tags: Duggirala Gopalakrishnayya, Gopalakrishnaiah

Wednesday, March 30, 2016

ఎక్కడో కూసింది ఓ కోయిల – ఈ మాసపు పాటలు

మరి “కోయిల” మాసం రాబోతోంది. కోయిల రాగాలను గుర్తుకు తెచ్చే “పాడవే పాడవే ఓ కోయిల”, “ఎక్కడో కూసింది ఓ కోయిల”, “కొమ్మలలో కోయిలనై కూయనా”, “గున్నమావి కొమ్మలమాటున కూసే కోయిల” ఆకాశవాణి వారి ఈ మాసపు పాటలు విందాము. పాట వివరాలు మొదట్లోకాని చివర్లో కాని వినబడతాయి. 



 పాడవే పాడవే ఓ కోయిల





...





 ఎక్కడో కూసింది ఓ కోయిల

...






 కొమ్మలలో కోయిలనై కూయనా




...





 గున్నమావి కొమ్మలమాటున కూసే కోయిల

...

గతంలో పోస్ట్ చేసిన ఈ లింకు ద్వారా మరికొన్ని కోయిల పాటలు వినవచ్చు. 

కోయిలమ్మతో ఇంటర్వ్యూ  



Tags: Eemasapu pata, lalitha geyalu, Koyila songs  

Saturday, March 26, 2016

అలనాటి వాణిజ్య ప్రకటనలు

గతంలో సినిమాల, ఎల్.పి. రికార్డుల ప్రకటనలు ఎన్నో ఈ బ్లాగులో పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ క్రమంలో ఒకసారి ఆనాటి వాణిజ్య ప్రకటనలు తెలుగులో వచ్చినవి వెలుగులోకి తెస్తే ఎలావుంటుంది అన్న ఆలోచనకు కార్యరూపమే ఇది. కారణాలు అనేకం కావచ్చు ఈ రోజుల్లో తెలుగు సంచికలలో ప్రకటనలు ఆంగ్లంలో వస్తున్నాయి. ఈ మధ్యవరకూ దుకాణాల పేర్లు చక్కటి తెలుగులో ఉండేవి, ఇప్పుడు తాటికాయంత ఆంగ్లాక్షరాలతో రాస్తూ ఓ మూలగా తప్పదన్నట్లుగా ఆవగింజంత ఆంధ్రాక్షరాలతో రాస్తునారు అదిగూడా ఉచ్ఛారణా దోషాలతో. ఈ కింది ప్రకటనలలోనివి కొన్ని ఎనభైఏళ్ల కిందటివి. ఆ ప్రకటనలలోని వస్తువులను కొన్నిటిని ఈనాటికి మనం వాడుతున్నాము. వీటిని పోస్ట్ చెయ్యటంలో ఉద్దేశం ఆనాడు ప్రకటనలు ఎలా ఉండేవి, అందునా తెలుగులో ఎలా ప్రకటించేవారు, వాటి భాషా సౌందర్యము, తీరుతెన్నులు, ఆనాటి వస్తువుల ధరలు, ఇతరత్రా వివరాలు తెలుసుకోటానికి తప్ప వాటిని మీరు కొనాలనీ కాదు, కొంటారనీ కాదు. “సినీతారల సౌందర్య రహస్యం” ఏమిటంటే తడుముకోకుండా “లక్స్” అంటాము. మరి అరుదైన ఆ ప్రకటనలు కొన్ని చూడవచ్చు. అమృతాంజనానికి శ్రీ గరిమెళ్ళ సత్యన్నారాయణ గారు ఆంగ్లంలో రాసిన పద్యాలు చూడవచ్చు. 


























































































Tags: Old Advertisements, Telugu advertisements, old telugu adds, Telugu prakatanalu,