Friday, July 25, 2014

రైళ్లు, పోస్ట్ కార్డులు వచ్చిన కొత్తల్లో

సహజంగా ఏదైనా కొత్త విషయం, కొత్త వస్తువు గురించి విన్నప్పుడు సందేహాలు కలుగక మానవు. అంతదాకా ఎందుకు మన హైద్రాబాదులో మెట్రో రైలు వస్తోందని తెలియగానే తమ ఆస్తులు, వ్యాపారాలు ఎక్కడ నష్టపోతాయో అని చాలామందికి గుండెల్లో రైళ్లు పరుగెత్తాయట. ఈ రైలు నేలమీద నుంచి పోవాలని కొంతమంది అంటే కాదు గగనతలంలోంచి పోవాలని కొందరు అన్నారు. ఇప్పుడు ససేమిరా వీల్లేదు భూగర్భంలోంచి పోవాలంటున్నారు. మూడు అంతస్తుల ఎత్తులో వెళ్ళే రైలు అమాంతం ధనేలుమంటూ భూగృహంలోనికి జొచ్చి ఆపళంగా ధభాలున మళ్ళీ రెండు అంతస్తుల ఎత్తునకు ఏగిన మన అర్భక గుండెలు దడదడలాడవా. ఖర్మం జాలక ఆ పుడమి తల్లి గర్భంలోనికి ఏ హుస్సేనుసాగరమో, ఏ ముచుకుందానదో కదలి తరలి వస్తే ఆ రైలు గతేం కాను. పట్టాలమీదకు ఏ మహిషమో, శునకమో వస్తే వాటి పరిస్ధితి ఏమిటి. రైలు ఆగిపోతే పట్టాల పక్కన యధాప్రకారం నడవనిస్తారా. విమానంలో మాదిరిగా టిక్కెట్టుతో పాటు ఇన్స్యూరెన్స్ పాలసీ గూడా జేబులో పెట్టుకోవాలా లాంటి చచ్చు సందేహాలు ఎన్నో మదిలో కదలాడుతూ ఉంటాయి.


అలాంటిది రైళ్లు, పోస్ట్ కార్డులు వచ్చిన కొత్తల్లో పాపం ఆనాటి అమాయక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో,  దాదాపు 80 ఏళ్ల కిందట ఆంధ్రభూమిలో వచ్చిన ఈ వ్యాసాల ద్వారా తెలుసుకుందాము (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో). ఆ రోజుల్లో ఆ రైలు యొక్క వేగానికి గాలి పీల్చుకోవటం కష్టమవుతుందని, ఆ వేగానికి కదులుతున్న దృశ్యాలను చూడలేక కళ్ళు దెబ్బతింటాయని, ఆ “ఇనుప దయ్యం” తమ ప్రాణాలను హరించి వేస్తుందని భావించారుట. 


హిందూ సౌజన్యంతో









2 comments:

  1. చాలా అమూల్యమైన విషయాలు

    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయాలు తెలిపినందులకు ధన్యవాదములు

      Delete