Monday, July 14, 2014

భమిడిపాటి వారి సాహిత్యం

మన తెలుగు సాహితీ వనంలో నవ్వుల పువ్వులు పూయించిన వారిని తీసుకుంటే కందుకూరి, పానుగంటి, గురజాడ, చిలకమర్తి, భమిడిపాటి, మొక్కపాటి, శ్రీపాద, విశ్వనాధ, మునిమాణిక్యం, జలసూత్రం, ముళ్ళపూడి, భానుమతి, పుచ్చా పూర్ణానందం, శ్రీరమణ, నండూరి పార్ధసారధి లాంటి వారు ఎందరో తారసిల్లుతారు. రచనాశైలి, ప్రక్రియ ఎవరిది వారిదే. ఈ నాటికి వారి రచనలను మనం మననం చేసుకుంటున్నాము. వారు సృష్టించిన పాత్రలు ఝంఘాల శాస్త్రి, గిరీశం, పార్వతీశం, విష్ణుశర్మ, కాంతం, బుడుగు, అత్తగారు, రాంబాబు మన మధ్య తిరుగాడుతూనే ఉంటాయి. 

గతంలో శ్రీపాద వారి సాహిత్యం పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ సారి భమిడిపాటి కామేశ్వరరావు గారి రచనలు చూద్దాము. లభించిన వారి రచనల వివరాలన్నీ ఒకచోటికి తెచ్చే చిన్న ప్రయత్నం ఇది. సహజంగా ఒక రచయిత పుస్తకం చూసినప్పుడు వారి ఇతర రచనల వివరాలు లభిస్తాయి. కానీ భమిడిపాటి వారి పుస్తకంలో వారి ఇతర రచనల వివరాలు తెలిసినంతవరకు లభించవు. 

అసలు వీరి రచనల పేర్లే గమ్మత్తుగా ఉంటాయి. వీరి హాస్య ప్రసంగ వ్యాసాలు చాలా బావుంటాయి. చిన్న విషయం పైన హాస్యాన్ని జనింపచేస్తూ పేజీలు పేజీలు రాశారు. శ్రీ విక్రమదేవవర్మ మహారాజా వారు వీరిని “హాస్యబ్రహ్మ” బిరుదుతో సత్కరించారుట. 

విశాలాంధ్ర వారు వీరి రచనలు పునర్ముద్రించి అందరికి అందుబాటులోకి తెచ్చారు. 





































Tags: Bhamidipati Kameswararao

No comments:

Post a Comment