Saturday, May 31, 2014

బాలమురళి గారి తత్వాలు – ఆకాశవాణి వారి రికార్డు

తత్వాలు అనగానే మనకు శ్రీ బాలమురళీ కృష్ణ గారే గుర్తుకు వస్తారు. మరొకరు ఈ ప్రయోగం చేసినట్లుగా కనబడదు. వారు “సంగీత” క్యాసెట్స్ కు ఇచ్చిన రికార్డింగ్ మనకందరకి పరిచయమే. అయితే అంతకు ముందు ఆకాశవాణి వారి కోసం పాడినట్లు అనిపిస్తున్న ఈ తత్వాలు విని చూడండి. ఇవి కొంచెం వేగంగా పాడినట్లు అనిపిస్తాయి. వీటిలో ఇతర గాయకులు కూడా కొంచెం గొంతు కలిపారు. క్యాసెట్లో ఆయన ఒక్కరే చాలా నిదానంగా పాడారు. “నిను విడచి ఉండలేనయా”, “ఏమి సేతురా లింగా”, “వస్తా వట్టిదే” అనే తత్వాలు విందాము.



 నిను విడచి ఉండలేనయా

 ఏమి సేతురా లింగా

 వస్తా వట్టిదే




Tags: Tatvalu, Tatvamulu, Balamurali Krishna, Ninu vidachi undalenaya, emi seturaa lingaa, vasthaa vattide, adhashavani, bhakthiranjani, Mangalampalli,

Thursday, May 29, 2014

ఎంకి పాటలు – శ్రీరంగం – బాలమురళి

“పూవునేనైతెనే” అనేపాట గోపాలరత్నం గారి గళంలోను, “ఏ వూరొ నేబోవ” అనే పాట బాలమురళీకృష్ణ గారి గళంలోను, “కళలీను వనమె వెలతెల లేలనోయి” అనే పాట యుగళగీతం గాను వినిచూద్దాము. 






పూవునేనైతెనే 








ఏ వూరొ నేబోవ   











కళలీను వనమె వెలతెల లేలనోయి










Tags: enki paatalu, balamurali Krishna, sriramgam gopalarathnam, nanduri subbarao, nandoori subbarao, mangalampalli, enki,




Tuesday, May 27, 2014

జగన్నాధాష్టకం – భక్తిరంజని

ఇవాళ పూరీలో వేంచేసియున్న ఆ జగన్నాధుని అష్టకం విందాము.  ఈ అష్టకం ఆకాశవాణి వారి భక్తిరంజని ప్రసారం.












Tags: Jagannadhastakam



Saturday, May 24, 2014

సూర్య స్తుతి – భక్తిరంజని

ఇప్పటికి 555 రోజుల ఈ బ్లాగు ప్రయాణంలో మీరందరూ
అభినందనలను తెలుపుతూ వెంటనడువగా సాగుతున్న శోభనాచలారోహణంలో ఇవాళ 300వ మెట్టుమీద నిలబడి ఉన్నాము. ముందుగా ఆకాశవాణి వారికి కృతజ్ఞతలు తెల్పుకోవాలి. ఈ బ్లాగులో ఎక్కువ శాతం వారి ప్రసారాలే ఉన్నాయి. ఆకాశవాణి వారి ప్రసారాలు అందనంత దూరంలో ఉన్న తెలుగు వారికి ఈ బ్లాగు చేరువవుతుందని ఆశిస్తూ,  ఇవాళ సూర్యనారాయణ స్తుతిని ఆస్వాదిద్దాము.



శ్రీ సూర్యనారాయణా మేలుకో 





సూర్య దండకము

<


Tags: sree suryanarayana meluko, surya dandakamu, rajani, sriramgam gopalarathnam, bhakthiranjani, akashavani,  

Friday, May 23, 2014

లింగాష్టకం – దారిద్ర్యదుఃఖదహన శివస్తోత్రం

ఓలేటి వెంకటేశ్వర్లు గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు మరియు బృందం గానం చేసిన “లింగాష్టకం” మరియు “దారిద్ర్యదుఃఖదహన శివస్తోత్రం” విందాము. ఆకాశవాణి వారి భక్తిరంజని ప్రసారాల నుండి 
 










 

లింగాష్టకం








దారిద్ర్యదుఃఖదహన  శివస్తోత్రం











Tags: Oleti Venkateswarlu, Sriramgam Gopalarathnam, Lingaastakam, Daridrya Duhkhadahana Siva Stothram, Bhakthiranjani, Akashavani



Thursday, May 22, 2014

శ్రీరాజరాజేశ్వర్యాష్టకం – భక్తిరంజని

ఆకాశవాణి akashavani కడప కేంద్రం భక్తిరంజని bhakthiranjani నుండి ప్రసారమైన శ్రీరాజరాజేశ్వర్యాష్టకం shri rajarajeshwari ashtakam ఆస్వాదించండి. ఎంతమంది ఎన్నిరకాలుగా గానం చేసినా ఆకాశవాణి వారి ప్రత్యేకతే వేరు. 















Tags: shri rajarajeshwari ashtakam, sri rajarajeshwari ashtakam, akashavani, bhakthiranjani, kadapa kendram



Wednesday, May 14, 2014

నిట్టల ప్రకాశదాసు గారి కీర్తనలు

బాలాంత్రపు రాజనీకాంతరావు గారి “ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము” నుండి నిట్టల ప్రకాశదాసు గారి గురించి కొన్ని వివరాలు తెలుసుకొని వారి కీర్తనలు ఒక నాలుగు విందాము. ఆకాశవాణి వారి భక్తిరంజని నుండి.








కాలమెల్ల నిష్పలమాయెను



రంగని వేగకూడితివి



వేరేమనకిక పని ఏమున్నది   




హరి నీ దాసులమయ్య
 




Tags: Nittala Prakasadasu, hari nee daasulamayya, kaalamella nishpalamaayenu, veremanakika pani emunnadi, rangani vegakoodithivi,

Monday, May 12, 2014

మధుర కీర్తనలు

ఇవాళ ఒక మూడు మధుర కీర్తనలు మననం చేసుకుందాము 


నారాయణ హరి ఓం పాండురంగ విఠల భక్తిరంజని నుండి




అచ్యుతానంద గోవింద నారేయణ కన్నడ సినిమా నుండి
 
 





కృష్ణా ముకుందా మురారే గానం శ్రీ త్యాగరాజ భాగవతార్ తమిళ సినిమా నుండి


Sunday, May 11, 2014

భావన – లఘు ప్రసంగాలు

పొద్దునపూట రేడియోలో “భావన” పేరిట ఒక కార్యక్రమం ప్రసారమవుతుంది. అందులో రోజుకొక అంశం మీద పేరొందిన రచయితల, రచయిత్రుల లఘు ప్రసంగాలు ఉంటాయి. పొద్దున్నే లేవంగాన్లే అటువంటి ప్రసంగాలు వినటంవల్ల వాటి ప్రభావం కొంత గాకపోయినా కొంతన్నా మనమీద వుంటుంది. మనల్ని ఆలోచింప చేస్తాయి. కొద్దిపాటి సాహిత్యాభిరుచి ఉంటే మనం కూడా చిన్న చిన్న అంశాలమీద తత్సంబంధిత విషయాలు క్రోడీకరించి నాలుగు మాటలు రాయటం మొదలు పెడితే కలిగే ఆనందం వేరు. మరి ఇవాళ కింద పోస్ట్ చేసిన వారి భావజాలమేమిటో విందాము. 







సుఖ శాంతులు కె. కె. రంనాధాచార్యులు గారు 

        



నేను నాది అరుణా వ్యాస్ గారు 

                



చీకటి వెలుగులు  - వి. ఎస్. ఆర్. మూర్తి గారు 




స్వాభిమానం దత్తాత్రేయ శర్మ గారు 





హృదయ భాష పులివర్తి కృష్ణ మూర్తి గారు 






Tags: Bhavana, K K Ranganadha Charyulu, Aruna Vyas, Dattatreya Sarma, V S R Murthy, Pulivarthi Krishna Murthy

Saturday, May 10, 2014

నాటి కధ చెప్పనా - జి‌. కృష్ణ గారు - ప్రముఖ పాత్రికేయులు

దుర్గాబాయ్ దేశ్.ముఖ్, మెహ్ది నవాజ్ జంగ్, అబిద్ హసన్ గార్ల గురించి ప్రముఖ పాత్రికేయులు, స్వాతంత్ర్య సమరయోధుడు జి. కృష్ణ గారు చెప్పిన కొన్ని సంగతులు విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి 

 

G. Krishna




Durgabai Deshmukh


Mehdi Nawaz Jung

Niloufer



Abid Hasan






హిందూ పేపర్లో ప్రచురించిన  మెహ్ది నవాజ్ జంగ్ గారి ఇంటి ఫోటోలు కొన్ని  ఈ కింది లింకు ద్వారా చూడండి.  




Tags: G. Krishna, Durgabai Deshmukh, Mehdi Nawaz Jung, Abid Hasan, Niloufer
 

Friday, May 9, 2014

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి సాహిత్య సేవ – వేదగిరి రాంబాబు గారు

రాజును చూసిన కళ్ళతో మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధి అయిందన్నట్లుగా శ్రీపాద వారి కధలకు అలవాటుబడ్డ ప్రాణాలకు వేరేవాళ్ళ కధలు అంతగా రుచింపకపోవచ్చు. ఎవరి రచనాశైలి వారిదైనా, భాష మీద పట్టు రావాలంటే శ్రీపాద వారి రచనలు తప్పక చదవాలి. వారి చిన్నకధలు చెప్పుకోటానికి చిన్నవే అయినా నవలకు తీసిపోవు. వీరి కధలు ఏదో పైపైన చదివేసి అయిందనిపించుకోటానికి వీలులేదు. “యావజ్జీవం హోష్యామి”, “షట్కర్మయుక్తా” కధల్లో భార్యాభర్తల మధ్య సంభాషణలు రసవత్తరంగా ఉంటాయి. శ్రీపాద వారిపై శ్రీ వేదగిరి రాంబాబు గారు నెఱపిన రెండు ప్రసంగాలు ఆకాశవాణి వారు ప్రసారం చేశారు. ఆ ప్రసంగ పాఠాలు వినిచూడండి. 






శ్రీపాద వారి సాహిత్యసేవ
 



శ్రీపాద వారి  ఆదర్శం 






వారి విభిన్న రచనల ముఖచిత్రాలు ఒకసారి చూడండి.




























 


















Tags: Sripada Subrahmanya Sastry, Sreepada, Vedagiri Rambabu