Friday, February 21, 2014

మన మధుర గాయకులు – వక్కలంక సరళ

అలనాటి మధుర గాయకుల మీద తెలుగు స్వతంత్ర వార పత్రికలో  ప్రచురితమైన వ్యాసాలను (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో) వెలికితీసి కొన్ని పాటలు జోడించి ఈ శీర్షిక ద్వారా 15 మంది గాయనీ గాయకుల వివరాలు వెలుగులోకి తేవటం జరిగింది. ఈ వ్యాసాలు వ్రాసిన “సారంగదేవ” రజని గారని శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారు వ్రాసిన ఒక వ్యాసంలో చదవటం జరిగింది. ఈ మధుర గాయకులు అందరూ ఆకాశవాణి వారికి పాడటం జరిగింది. సినిమా పాటలు మినహాయిస్తే ఈ వ్యాసాల్లో పేర్కొన్న చాలా రేడియో కార్యక్రమాలు, గేయాలు లభించటం లేదు. ఆకాశవాణి వారి వద్ద కూడా ఉన్నాయో లేదో తెలియదు. చివరగా వక్కలంక సరళ గారి మీద వచ్చిన వ్యాసం చూడండి. ముందు ముందు, ఇతర గాయనీ గాయకుల మీద లభ్యమైన వ్యాసాలు, వివరాలు ఈ శీర్షిక ద్వారా అందించటానికి ప్రయత్నిస్తాను. 




ముందుగా బాలరాజు సినిమా నుండి సరళ గారు పాడిన తీయని వెన్నెల రేయి  పాట ఒక సారి జ్నప్తికి తెచ్చుకుందాము.












కీలుగుఱ్ఱం సినిమాలో  సరళ గారు పాడిన  కాదు సుమా కల కాదు సుమా పాటను గతంలో పోస్ట్ చేయటం జరిగింది. ఈ సారి అదే సినిమాలోని ఇంకో పాట విందాము. 




సరళ గారి అమ్మాయి స్వప్నసుందరి గారు  గొప్ప కూచిపూడి కళాకారిణి అని పద్మభూషణ్ గ్రహీత అని తెలిసింది.   హిందూలో వచ్చిన ఆ వివరాలు ఈ కింది లింకు ద్వారా చూడండి.




సరళ గారి ఇంకో అమ్మాయి పద్మ గారు గోరింటాకు సినిమాలో నటించారుట. ఆవిడతో టి‌వి9 లో వచ్చిన ఇంటర్వ్యూ ఈ యూట్యూబ్ లింకు ద్వారా చూడండి. 




Tags: Vakkalanka Sarala, V Sarala Rao, Balaraju, Keelugurram, Theeyani Vennela Reyi, Enta anandambayenaha




No comments:

Post a Comment