Friday, January 31, 2014

శ్రీ అష్ట లక్ష్మీ స్తోత్రం – భక్తిరంజని

ఆకాశవాణి భక్తిరంజని నుండి ప్రసారమైన “శ్రీ అష్ట లక్ష్మీ స్తోత్రం” shree ashta lakshmi stotram విందాము 














Thursday, January 30, 2014

అన్నవరం సత్యదేవుని సంకీర్తనలు – భక్తిరంజని

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి మీద భక్తిరంజనిలో ప్రసారమైన “శ్రీ సత్యనారాయణా మేలుకో”, “సత్యదేవు సేవించి తరింతురే”, “అన్నవరం గిరిపైన కొలువున్న”, “సత్యదేవు అనంతలక్ష్మిని” అనే నాలుగు సంకీర్తనలు విందాము. 




 శ్రీ సత్యనారాయణా మేలుకో




 సత్యదేవు సేవించి తరింతురే


  
అన్నవరం గిరిపైన కొలువున్న


 సత్యదేవు అనంతలక్ష్మిని




Tags: sathyadevuni keerthanalu, bhakthiranjani, sri sathyanarayana, ananthalakshmi, annavaram  

Tuesday, January 28, 2014

అన్నమాచార్యుల కీర్తనలు - భక్తిరంజని

అన్నమాచార్యుల కీర్తనలు ఎంతో మంది గానం చేశారు. భక్తిరంజనిలో ప్రసారమైనంత మాత్రాన అన్నీ ఆకాశవాణి వారివి అవకపోవచ్చు. ముందుగా “ఇందిరా నామము ఇందరికి” అనే కీర్తన విందాము. ఇది రేడియో వారి రికార్డు అనుకుంటాను. శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు వారి “నా రేడియో అనుభవాలు జ్ఞాపకాలు” లో “ఇందిరా నామము ఇందరికి” అనే కీర్తన భక్తిరంజని కోసం పాడాము అన్నారు. ఈ చక్కటి కీర్తన విని చూడండి. తరువాత “రాజీవ నేత్రాయ” మరియు “ఒకపరికొకపరి” విందాము.





 

ఇందిరా నామము ఇందరికి    


రాజీవ నేత్రాయ   


ఒకపరికొకపరి


Tags: Annamacharya, indiraa naamamu, okaparikokapari, raajeeva netraaya, bhakthi ranjani, akashavani

Monday, January 27, 2014

తమిళంలో గోపాలరత్నం గారు పాడిన తిరుప్పావై – విజయవాడ కేంద్రం

ఇంతకు ముందు పోస్ట్ చేసిన, హైదరాబాద్ కేంద్రం వారు ప్రసారం చేసిన, తిరుప్పావైలో ఎం. ఎల్. వసంతకుమారి గారు తమిళంలో పాడితే, శ్రీరంగం గోపాలరత్నం గారు తెలుగులో పాడటం జరిగింది. విజయవాడ కేంద్రం వారు ప్రసారం చేసిన తిరుప్పావైలో శ్రీరంగం గోపాలరత్నం గారు తమిళంలో పాడటం జరిగింది. లభ్యమైన 15, 16 పాశురములు పోస్ట్ చేస్తున్నాను. రికార్డింగు ఆశించినంత గొప్పగా రాలేదు. గోపాలరత్నం గారు గూడ తమిళంలో పాడారు అని తెలియ చెప్పటానికి పోస్ట్ చేస్తున్నాను. నెట్ లో ఎక్కడో చదివాను ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు మంగళంపల్లి వారు తమిళంలో పాడిన తిరుప్పావై ప్రసారం చేసేవారని. కింద చివరి ఫోటోలో వివరాలు చూస్తే నిజమే అనిపిస్తుంది. 


 











15వ పాశురము 





16వ పాశురము





          ఆకాశవాణి వారి వాణి నుండి 




Tags: thiruppavai,  srirangam gopalarathnam, bhakthi ranjani, AIR,

Saturday, January 25, 2014

చింత చిగురు చిన్నదానా – రేడియో పాట – ఘంటసాల

ఘంటసాల గారి ప్రైవేట్ సాంగ్స్ సేకరించిన వారికి “చింత చిగురు చిన్నదానా” అనే హుషారైన గేయం తెలిసేవుంటుంది. ఇది బహుశా HMV వారి కోసం ఇచ్చిన రికార్డు అయివుంటుంది. చాలా సంవత్సరాల కిందట రేడియోలో “చింత చిగురు చిన్నదానా” పాట వస్తే రికార్డు చేయటం జరిగింది. ఆకాశవాణి వారి కోసం ఘంటసాల గారు ఈ పాట పాడి వుంటారు. రెండు పాటలు విని తేడా గమనించండి. 

 
ముందుగా రేడియోలో వచ్చిన పాట 






జీవితమంతా కలయేనా రేడియోలో వచ్చిన ఘంటసాల గారి లలిత గేయం కూడా వినండి. 





Tags: Ghantasala, chintha chiguru chinnadanaa, jeevithamanthaa kalayenaa, Akashavani, radio songs,

Friday, January 24, 2014

మన మధుర గాయకులు - ఎ. పి. కోమల

“తెలుగు స్వతంత్ర” వారపత్రికలో “మన మధుర గాయకులు” శీర్షికన (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యం)      ఎ. పి. కోమల గారి గురించి ప్రచురించిన ఒక వ్యాసం చూడండి. 



ముందుగా ఒక పవళింపు పాట. చాలా ఏళ్ళ కిందట రేడియోలో ప్రసారమైనది. రచన దేవులపల్లి వారని సమాచారం.











చివరగా రక్షరేఖ సినిమా నుండి ఘంటసాల గారితో కలిసి పాడిన ఒక పాట






Tags: AP Komala, jo jo jo sarasija nayanaa, akashavani

Thursday, January 23, 2014

తిరుప్పావై – సప్తపది – 28, 29, 30 పాశురములు

తిరుప్పావై 28, 29, 30వ రోజుల్లో ప్రసారమైన పాశురములు వినండి. తమిళంలో ఎం. ఎల్. వసంతకుమారి గారు, తెలుగులో శ్రీరంగం గోపాలరత్నం గారు గానం చేశారు. మొత్తానికి తిరుప్పావై 30 పాశురాములలో 5 పాశురములు (3, 13 15, 16, 17) మినహా మిగతా 25 పాశురములు పోస్ట్ చెయ్యటం జరిగింది. అవి కూడా ఎప్పుడన్నా పునః ప్రసారం చేస్తే సేకరిద్దాము. 












28వ రోజు  




29రోజు




30రోజు  








Tags: thiruppavai, M L vasantha kumari, srirangam gopalarathnam, bhakthi ranjani, AIR,

Wednesday, January 22, 2014

సజీవ స్వరాలు – ఆకాశవాణి - అక్కినేని నాగేశ్వర రావు

నాగేశ్వరరావు గారి 90వ జన్మదినము సంధర్భముగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు వారితో నెఱపిన సంభాషణను  ప్రసారం చేశారు. వారి అనుభవాలు ఎన్ని సార్లు విన్నా ప్రతిసారి నూతనత్వం కనబడుతూనే వుంటుంది. 



..

Tags: Akkineni Nageswara Rao, ANR

Monday, January 20, 2014

దేవీ నవరత్నమాలికా స్తోత్రం – భక్తిరంజని

శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ దేవీ నవరత్నమాలికా స్తోత్రం భక్తిరంజని ప్రసారాల నుండి ఆస్వాదించండి. వింటూ చదువుకోవటానికి వీలుగా ఆ శ్లోకాలను గూడా పోస్ట్ చెయ్యటం జరిగింది. 3వ శ్లోకం నుండి ఆరంభమవుతుంది. చివరదాకా ఒకటే లయతో సాగే ఈ స్తోత్రం వినసొంపుగా ఉంటుంది. 












Tags: devi navarathnamalikaa stothram, bhakthiranjani, Akashavani

Saturday, January 18, 2014

తిరుప్పావై – సప్తపది – 24, 25, 26, 27 – భక్తిరంజని

తిరుప్పావై 24, 25, 26, 27వ రోజుల్లో ప్రసారమైన పాశురములు వినండి. తమిళంలో ఎం. ఎల్. వసంతకుమారి గారు, తెలుగులో శ్రీరంగం గోపాలరత్నం గారు గానం చేశారు. 








24వ రోజు





25రోజు  





26రోజు  




27రోజు 







Tags: thiruppavai, M L vasantha kumari, srirangam gopalarathnam, bhakthi ranjani, AIR

Friday, January 17, 2014

మన మధుర గాయకులు - ప్రయాగ నరసింహ శాస్త్రి

“తెలుగు స్వతంత్ర” వారపత్రికలో (1953) “మన మధుర గాయకులు” శీర్షికన  ప్రయాగ నరసింహ శాస్త్రి గారి గురించి ప్రచురించిన ఒక వ్యాసం చూడండి. 



యధాప్రకారం ముందుగా ప్రయాగ వారు ఆలపించిన శివ శివ మూర్తి అనే జానపద గేయం విందాము.





                                అనసూయా దేవి గారి జానపద గేయాల నుండి





డా. ఆర్. అనంత పద్మనాభరావు గారి ప్రసార ప్రముఖులు పుస్తకం
నుండి ప్రయా వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాము.

 

ఈ లింకు ద్వారా గూడా ప్రయా వారి గురించి
మరికొన్ని వివరాలు చూడండి.




గతంలో పోస్ట్ చేసిన ప్రయాగ వారి గేయాలు ఈ కింది
లింకుల ద్వారా చూడండి. గూటి చిలకేదీరా అన్న తత్వం 
ప్రయాగ వారు పాడారని సమాచారం. 






Tags: prayaga narasimha sastry, siva siva murthy



 


Wednesday, January 15, 2014

పల్లెల్లో సంక్రాంతి - సంగీత రూపకం - ఆకాశవాణి

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రేడియోలో ప్రసారమైన చిన్న సంగీత రూపకం “పల్లెల్లో సంక్రాంతి” వినండి. ముందుగా సంక్రాంతి ప్రాశస్త్యాన్ని వివరించే లఘు ప్రసంగం ఒకటి భావన కార్యక్రమంలో ప్రసారమైనది విందురుగాని.


















పల్లెల్లో సంక్రాంతి -  సంగీత రూపకం  









చివరగా వినంగాన్లే హృదయాన్ని హత్తుకొనే ఈ మధురమైన వెట్టి వలపు చల్లకు విష్ణు మూరితి నాకు అనే అన్నమాచార్య కీర్తన వినండి. బహుశా ఇది ఆకాశవాణి  వారి రికార్డు అయిఉంటుంది.




Tags: sankranthi, vetti valapu challaku, akashavani, AIR, samgeetha roopakam,