Wednesday, June 12, 2013

ఆషాఢపట్టి - హాస్య ప్రసంగ వ్యాసం - పుచ్చా పూర్ణానందం గారు

ఎటువంటి అల్ప విషయం మీదయినా హాస్య ధోరణిలో వ్యాసాలు రాయగలిగిన రచయితలు ముగ్గురు కనబడతారు. ప్రధములు పానుగంటి వారు. వారి సాక్షి వ్యాసాలు అందరికీ పరిచయమే. రెండవ వారు భమిడిపాటి కామేశ్వరరావు గారు. వారి హాస్య ప్రసంగ వ్యాసాలు కూడా తెలిసే ఉంటాయి. భమిడిపాటి వారి రచనలు ఈ మధ్య పునర్ముద్రణకు నోచుకున్నాయి. అదే కోవకు చెందిన మూడవ రచయిత పుచ్చా పూర్ణానందం గారు. వీరి రచనలలో ఆషాఢపట్టి, మీసాల సొగసులు ఉన్నాయి (వాటి విషయసూచిక కింద చూడండి) . ఇవి ప్రస్తుతం ప్రచురణలో లేవు. వీరి ప్రసంగాలు ఆకాశవాణిలో ప్రసారం అయ్యాయి. వీరు రెండు, మూడు సినిమాలలో గూడా కనిపించారు. వీరివి రెండు ప్రసంగాలు (ఆయన చదివినవి) మాగంటివారి వెబ్సైట్లో ఉన్నాయి. 

వీరి హాస్య రచన ఆషాఢపట్టి కింద చూడండి. ఇది జాగృతి 1962 సంచికలో వచ్చింది. (ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో). మామగారు ఒకాయన అల్లుడికి ఆషాఢపట్టి కింద ఒక కలాన్నిహూకరిస్తాడు. దాంతో అతగాడి కష్టాలు ఆరంభమవుతాయి.

కావాలనుకుంటే ఈ కింద ఆడియోలో వింటూ చూడండి. ఆడియోలో వినిపించే గొంతు వారిది కాదు. ఆడియో, రెడ్ కలర్ లో మార్క్ చేసిన బాబుగారు నమ్మండి నమ్మకపొండి పేరా నుంచి మొదలు అవుతుంది.













No comments:

Post a Comment