Saturday, June 29, 2013

ఎండమావులు – నాటకం – సాహిత్యం – నండూరి సుబ్బారావు (రేడియో)

నండూరి సుబ్బారావు గారి పేరు వినంగాన్లే సాహితీపరులకు ఎంకిపాటల సుబ్బారావు గారి పేరు గుర్తుకు రావచ్చు. కానీ గతంలో రేడియో ప్రోగ్రాములు విన్నవారికి నండూరి సుబ్బారావు గారు గుర్తుకు వచ్చే ఉంటారు. రేడియోలో ఆయన గొంతు వినని రోజు లేదేమో. ఆయన రేడియో నాటకాలలో నటించటం వరకే మనకు తెలుసు, కాని ఆయన నాటకాలు రచించిన విషయం చాలామందికి తెలియక పోవచ్చు. ఆయన రచించిన “ఎండమావులు” అనే నాటకం కింద పోస్ట్ చేస్తున్నాను. ఇది “చిత్రనళీయం” అనే నాటిక సంపుటి నుండి, 1967 ముద్రణ. అప్పటికే ఆయన రచించిన నాటకాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ నాటకం చదువుతూ వుంటే సుబ్బారావు, నాగరత్నమ్మ గార్ల గొంతులు చెవుల్లో వినబడుతున్నట్లుగా వుంటుంది. చదివి ఆనందించండి. 
























చివరగా ఒక్కసారి ఆయన గొంతు విందాము. ఇది చిలకమర్తి వారి  గణపతి నాటకం నుండి చిన్న బిట్. గణపతి (నండూరి సుబ్బారావు గారు) వాళ్ళ మాయ్యను తన ఆస్తి ఇవ్వమనే సన్నివేశంలోనిది. ఈ నాటకం 17-11-1991 నాడు ప్రసారం అయింది. ఈ నాటకం 1967లో బందా కనకలింగేశ్వరరావు గారి పర్యవేక్షణలో విజయవాడ కేంద్రం వారు ప్రసారం చేసినట్లుగా పేర్కొన్నారు.  

ఫైర్ ఫాక్స్ బ్రౌసర్ వాడేవాళ్ళకు ప్లేయర్ కనబడకపోతే ఎడోబ్ ఫ్లాష్ ను  యాక్టివేట్ చేయండి 



Thursday, June 27, 2013

ఏ తపసు నే జేయవలెనో యెంకితో - బాలమురళీకృష్ణ

బాలమురళీకృష్ణ గారు గానం చేసిన నండూరి వెంకట సుబ్బారావు గారి ఎంకిపాట “ఏ తపసు నే జేయవలెనో యెంకితో” 




ఫైర్ ఫాక్స్ బ్రౌసర్ వాడేవాళ్ళకు ప్లేయర్ కనబడకపోతే ఎడోబ్ ఫ్లాష్ ను  యాక్టివేట్ చేయండి

Wednesday, June 26, 2013

1941 లో విడుదలైన చిత్రాల పోస్టర్స్

ఈ సంవత్సరంలో విడుదల అయిన చిత్రాల తాలూకు లభ్యమైన కొన్ని పోస్టర్స్ కింద పోస్ట్ చేస్తున్నాను. ఇవి ప్రెస్ అకాడమీ వారి వెబ్ సైట్ లోని పాత తెలుగు సంచికల నుండి తీసుకోవటం జరిగింది.


































































చివరగా వాహిని వారి దేవత సినిమాలో నాగయ్య గారు పాడిన రావే రావే బంగరు పాప  అనే పసందైన పిల్లల పాట విందాము. 

ఫైర్ ఫాక్స్ బ్రౌసర్ వాడేవాళ్ళకు ప్లేయర్ కనబడకపోతే ఎడోబ్ ఫ్లాష్ ను  యాక్టివేట్ చేయండి