Sunday, November 18, 2012

శిరస్త్రాణములు



ప్రకటన
శిరస్త్రాణములు

గుప్తరాజుల కాలము నుండి శిరస్త్రాణములు తయారు చేయుచున్న ఏకైక సంస్థ. కాలానుగుణముగా మార్పులు చెందుతూ వచ్చి ఇప్పుడు పైన చూపిన విధంగా తయారు చేస్తున్న మా ఈ శిరస్త్రాణముల వల్ల ఉపయోగములు  బహు మెండు. ఇది ధరించినవారు అప్పులు ఇచ్చిన వారినుండి మొహం చాటేయటానికి, భార్యా భాధితులకు కపాల సంరక్షిణిగాను, విధ్యార్ధులకు పాధ్యాయుల మొట్టికాయల నుండి, ఇలా పలు విధంభులుగా నుపయోగపడును.  రక్షకభటులు వారి ఆజ్నాను సారంగా, వాహన చోదకులు  ఇది ధరియించినచో, రక్షకభటులు విధించు పన్నుల నుండి తప్పించుకొనవచ్చును.  ప్రమాదము సంభవించినపుడు వాహన చోదకుని శిరము నుండి బయటకు వచ్చి దూరముగా ఎగిరిపడుటయే మా ఈ శిరస్త్రాణముల ప్రత్యేకత. మీ శిరమునకు మా పూచీ లేదు.  
                                                వలయు వారు సంప్రదించండి
                                                     టోపీవాలా అండ్ కో
                                                       శిరస్త్రాణపురం

వెన్కట్రమ్ణ
 

No comments:

Post a Comment