Thursday, November 29, 2012

కన్నాంబ గారు పాడిన లాలి పాట



లాలి తనయ లాలి సుందర నంద కుమారా జో - కన్నాంబ 


గత కాలంలో akashavani ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ప్రసారం చేసిన,  kannamba కన్నాంబ గారు పాడిన lali lali  లాలి తనయ లాలి సుందర నంద కుమార జో అనే మధురమైన లాలిపాటను వినండి. kannamba private songs




VAK Ranga Rao



ప్రత్యేక జనరంజని - శ్రీ వి. ఎ. కె. రంగారావు మూడవ భాగం
vak ranga rao, v a k ranga rao, janaranjani, akashavani hyderabad

Sunday, November 25, 2012

VAK Ranga Rao









ప్రత్యేక జనరంజని - శ్రీ వి. ఎ. కె. రంగారావు రెండవ భాగం

V.A.K. RANGA RAO, JANARANJANI, V A K RANGA RAO, vak ranga rao, radio recordings,


Saturday, November 24, 2012

VAK Ranga Rao



ప్రత్యేక జనరంజని - శ్రీ వి. ఎ. కె. రంగారావు మొదటి భాగం



ఇరవై సంవత్సరాల క్రిందట 15-11-1992 నాడు AKASHAVANI HYDERABAD ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగం వారి ప్రత్యేక JANARANJANI జనరంజని కార్యక్రమాన్ని సుప్రసిద్ధ సినీ విమర్శకులు, సినీ పరిశోధకులు V A K RANGA RAO శ్రీ వి. ఎ. కె. రంగారావు గారు సమర్పించటం జరిగింది. ఇది మిగతా ప్రత్యేక జనరంజని కార్యక్రమాలకన్నా విలక్షణంగా వుంటుంది. ఇరవై ఏళ్ల క్రిందట రికార్డు చేసుకున్న ఈ కార్యక్రమం  ఆరు భాగాలుగా పోస్ట్ చేయబోతున్నాను. ముందుగా మొదటి భాగాన్ని వినండి. RADIO RECORDINGS


Thursday, November 22, 2012

పేల ప్రహసనం




బ్రహ్మ దేవుడు సృష్టి నిర్మాణ కార్యక్రమంలో నిమగ్నుడై వుండగా సరస్వతీ దేవి స్వామీ, మీ సృష్టి సిర్మాణంలో ప్రతి జీవి ఇంకో జీవి మీద ఆధార పడుతోంది కానీ మానవు మీద ఎవరు ఆధార పడకపోవటం న్యాయమేనా అని ప్రశ్నించగా, బ్రహ్మ నిజమే సుమా అనుకుంటూ యధాలాపంగా తలమీద చెయ్యి వేసుకోగానే ఆయనకు తళుక్కుమని స్పృజియించిన జీవి పేను. ఆ విధంగా సృష్టి ఆరంభం నుంచి మానవులమీద ఆధారపడిన జీవి పేను. మొదట్లో పేలకు రెక్కలు వుండేవి. ఒకనాడు ఇంద్రుడు భార్యా సమేతంగా భూలోక విహారార్ధం రాగా ఒక పిల్ల పేను తెలియక శచీ దేవి తలలో జేరి బాధించిన కారణంగా ఇంద్రుడు కోపోద్రిక్తుడై తన వజ్రాయుధంతో పేల రెక్కలను ఖండించటంతో, పేలు ఇంద్రుడితో మొరపెట్టుకున్నాయి, స్వామీ మా అపరాధం మన్నించండి, ఇక ముందట మా శక్తి సామర్ధ్యాలతో మానవులను స్వర్గలోకం కేసి చూడకుండా చేస్తాము, మేము వారి శిరస్సు నందు స్ధిర నివాసమేర్పరచుకొని  నిరంతరము వారి దృష్టిని మా మీద నిలుపుకొనేటట్లుగా చేసుకొని  వారి ధ్యానాన్ని భగ్నం చేస్తాము అని.   ఇంద్రుడు సంతోషించి తధాస్తు అన్నాడు. అందుకనే తల్లో పేలున్న వారు ధ్యానానికి అనర్హులు. వారికి ధ్యానం మీద నిలకడ లేకుండా చేయటానికి పేలు నిరంతరము కృషి చేస్తూనే వుంటాయి. ఈ పేల వృత్తాంతం మనకు మత్కుణోపాఖ్యానంలో విపులంగా కనిపిస్తుంది.

పేల నుండి మానవులు చాలా నేర్చుకోవలసింది వుంది. పేలు శ్రమైక జీవులు. పేలు తమలో తాము మానవుల లాగా  కలహించుకోవు. కలసి మెలసి అన్యోన్యంగా వుంటాయి. సృష్టి ఆరంభంనుంచి మానవులతో పేలకు అవినాభావ సంభంధం వుంది. తాము ఆశ్రయించిన వారితో తుది వరకు కలిసి మెలిసి ఉంటాయి. పేలు విశ్వాసము గల ప్రాణులు. ఒకసారి  ఒకరిని శ్రయించిన తరువాత వారిని వదలవు. మంచో చేడో తమ ప్రాణములు కడతేరే వరకు వారిని అంటిపెట్టుకొని వుంటాయి. పేలు ఎంతో బలం కలిగినవి. వాటి పట్టు ఉడుము పట్టుకన్నా బలమైనది. పేలు ఎంతో చురుకు దనము గల జీవులు. మానవులకు గూడా అంత చురుకు దనము లేదు. ఇట్టే రెప్ప పాటు సమయములో కనుమరుగై పోతాయి. పాపం అవి ఎండలను  వానలను గూడ తట్టుకొని జీవితాలను వెళ్ళతీస్తూ ఉంటాయి. మానవుల లాగా ప్రతి చిన్న విషయానికి భయపడే తత్వం కాదు వాటిది. ఎంత తుఫాను గాలి రాని వెంట్రుకలు కదిలి పోతున్నా సరే ఆ వెంట్రుకల కుదుళ్లను గట్టిగా  పట్టుకొని కాపాడు కొంటాయి. తాము ఆశ్రఇంచిన వ్యక్తి జాగరూకుడై వున్నంత కాలము తమ కున్న పరిధిని దాటి బయటకు రావు. పాపం అవి తమ అన్ని కార్యక్రమాలను తమకున్న ఆ కొద్ది పాటి స్థలంలో నిర్వహించుకొంటాయి. ఆ కొద్ది పాటి ప్రదేశంలోనే పురుళ్ళు పుణ్యాలు నిర్వహించు కోవాలి. మానవులు తల స్నానం చేసేటప్పుడే అవి కూడా తమ స్నానాది కార్యక్రమాలు కావించుకొంటాయి. పండుగ  దినాలు వచ్చినపుడు మాత్రము పాపం పేలకు నరకమే. తన తలలో జీవిస్తున్న జీవులకు ప్రాణహాని కలుగుతుందే అనే బాధ ఇసుమంతైనా లేకుండా వేడి వేడి నీళ్ళు తల మీద పోసుకొని రరకాల ద్రవ్యాలతో బర బర బరుక్కుంటూ, గోక్కుంటూ, గీక్కుంటూ తల రుద్దుకుంటూ వుంటే పాపం కలసి మెలసి వున్న జీవులన్నీ బ్రతుకు జీవుడా అనుకుంటూ చెట్టుకొకడు పుట్టకొకడు అన్న రీతిగా వారి వేళ్ళ కింద నుండి వేగ వేగంగా తప్పించుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తమ కున్న ఆ కొద్దిపాటి పరిధిలోనే పరుగెడతాయి. ఎంత ఉడుకు నీళ్ళు పోసినా, చన్నీళ్ళు పోసినా తట్టుకొని నిలబడతాయి. మానవులకు  కూడా  అంత నిలకడ లేదు. చిన్న పాటి వర్షానికే ఏదన్నా పంచన చేరుతారు. మానవులు సన్నని నీటి ధారలు తమ తలమీద పడుతూ స్నానం చేస్తున్నా  ఈ చిన్న ప్రాణులు మాత్రం ఆ ధారా ప్రవాహానికి ఎదురొడ్డి నిలుస్తాయి. అంతటితో అయిందా అంటే లేదు. క్షణమైనా  ఆగకుండా ఒక వస్త్రాన్ని తమ తల మీద వేసుకొని వేగంగా తుడుస్తూ వుంటారు. కొంత మందైతే ఒక యంత్ర పరికరంతో వేడి గాలి సహాయంతో జుట్టును ఆరబెట్టుకుంటారు. ఈ తుఫాను వాతావరణం సద్దుమణిగాక ఆ పేలు తప్పిపోయిన తమ వారిని వెతుక్కుంటూ ఒకచోటగా చేరతాయి. మానవుడు ఎంత నిర్దయుడు. అమ్మా అమ్మా అంటూ ఆ పిల్ల పేలు చేసే హాహాకారాలు వారి చెవిక్కెక్కవు గదా. పాపం ఆ పేలు బుద్ధుడు ఉదయించినట్టి  ఈ భూమిలోన కలిగి వున్నారు మీకేల కరుణ లేదు అని ఘంటసాల గారి పాటను మననం చేసుకుంటాయి.

అసలు పేల వల్ల కలిగే హాని ఏమిటి చెప్పండి. కేవలం దురదను పుట్టిస్తాయి అన్న అపవాదు తప్ప. దురదగుంటాకు వల్ల దురద కలిగితే లేదు గాని పేల వల్ల కలిగితే తప్పా? దురద కలిగినపుడు గోకుతుంటే కలిగే ఆనందం అనుభవించే వాడికే తెలుస్తుంది. అందుకే దురదలో వున్న మజా అది అనుభవించితే తెలియునులే అని పెద్దలు వూరికె అన్నారా. అసలు తల్లో పేలు వుంటే ఇంకే ప్రాణి మనకేసి చూడదు. పేలు చాలా కొద్దిగా మాత్రమే మన నుండి రక్తాన్ని గ్రహిస్తాయి అది కూడా నెప్పి తెలియకుండా. అదే మశక మహాశయులు వారిని గాని మత్కుణ మహాశయులు వారిని గాని చూడండి వారు మన దగ్గర నుండి బోలెడంత  రక్తాన్ని గ్రహిస్తారు, గ్రహించి కదలలేక మన చేతుల్లో చస్తారు. పేలు అలా కాదే.  ఒకవేళ పేలు కూడా అలా తాగితే అవి మన చేతుల్లో చిక్కి చనిపోతాయి గదా.  పొదుపు పేల  నుండే నేర్చుకోవాలి. చాలా స్లిమ్ గా వుంటాయి. మన లాగా వుందికదా అని తినేసి వళ్ళు పెంచుకోవు. తలలో పొలుసులు వూడితే చుండ్రు అని భ్రమించి నెత్తిన కోడి గుడ్డు కొట్టుకొని, నిమ్మ చెక్క రుద్దుకొని వుపశమనం పొందుతారు కానీ పేలకు కలిగే ఇబ్బందిని గురించి పట్టించుకోరు.

పేలు ఎంతోమందికి పాధి కలిగిస్తున్నాయి. ఈ పేలను ఎలా చంపాలా అని మానవులు నిరంతరము కృషి చేస్తూనే వున్నారు. ఈ పేలను చంటానికి వాడే నూనెలను  తయారుచేసే పరిశ్రమలలో పనిచేస్తూ ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.  పేలు తీసుకోటానికి వాడే దువ్వెన్నలను తయారు చేస్తూ ఎంతోమంది జీవనోపాధి పొందుతున్నారు. మానవుడు ఎంత కృతఘ్నుడు. తనకు మేలు చేసే జీవులకు హాని తలపెడుతున్నాడు.

మానవుడు తన బ్రతుకు తెరువు కోసం ఎన్నెన్నో వృక్ష, జంతు, పక్షి జాతులను అంతరింపజేశాడు, కానీ పేలను ఏమి చెయ్యలేకపోయాడు. సృష్టి ఆరంభం నుంచి తన మనుగడను కాపాడుకొంటూ వస్తున్న జీవి పేను. పేను బ్రహ్మ ర ప్రసాదిని. అణుధార్మికతను కూడా తట్టుకోగలిగిన జీవి పేను.

పిల్లలంటే పేలకు ఎంతో ష్టం. నిరంతరము వారి వెన్నంటే వుంటాయి. పిల్లలు తల గోక్కుంటూ ఉంటే చూడటానికి  ఎంత ముద్దుగా ఉంటారు. అసలు అలా గోక్కుంటేనే వారికి చాలా విషయాలు గుర్తుకు వస్తాయి.   ఏమాత్రం అవకాశం దొరికినా పక్క వారి తలలో ప్రవేశించి, అక్కడి ఇతర పేలతో సంబంధ బాంధవ్యాలను ల్పుకొంటాయి. పేలు కుల మతాలకు అతీతులు. మానవులలాగా కులాల కోసం మతాల కోసం పాకులాడవు.
మానవుడు నిద్రపోయినా గాని తాను నిద్రపోక ఆ సమయంలోనే, కొలంబస్ అమెరికాను కనిపెట్టినట్లుగా కొత్త తలకాయలను కనిపెడుతూ దేశాంతరాలు, ఖండాంతరాలు ప్రయాణిస్తూ, కొత్త వారితో పరిచయాలు పెంచుకుంటూ, వూరవెల్లి లాగా అవసరమయితే అవతల వారి శిరస్సు మీద వుండే జుట్టు రంగుననుసరించి తమ శరీర రంగును గూడా మార్చుకోగలిగిన జీవి పేను.

పేలకు బట్టతలంటే బొత్తిగా ఇష్టం వుండదు. అయినా గాని ఒక్కోసారి వాటి పిల్లలు ఆడుకోటానికి జుట్టు మధ్యలో ఎటువంటి అనుమానం రాకుండా వివిధ ఆకృతులలో మైదానాలను సృష్టిస్తూ వుంటాయి. అక్కడ జుట్టుని మాయం చేస్తాయి. నున్నగా నిగనిగ లాడే ఆ ప్రదేశంలో పిల్ల పేలు జారుడు బండలాటలాడుకుంటాయి. దీన్నే మన వారు పేను కొరుకుడు అంటారు. దీని మీద మళ్ళీ జుట్టు మొలిపించటానికి మానవుడు పడరాని పాట్లు పడతాడు.

చలన చిత్ర పరిశ్రమ  వాళ్ళు పేలకు చాలా అన్యాయం చేశారు. ఈగ, కందిరీగ, తూనీగ అంటూ చిత్రాలు  తీశారు గాని పేను మీద ఎవరన్నా తీశారా?  పిల్లల కధా రచయితలు గూడా పేను మీద అట్టే కధలు రాయలేదు.
మనలో చాలా మందికి అన్నీ రకాల తల నూనెలు పడవు. కానీ పేలకు అలా కాదే. కొబ్బరి నూనె, మందార నూనె, బాదం నూనె, గంధం నూనె, నువ్వుల నూనె, సుగంధ నూనె, ఆవుదం లాంటి రాకరకాల చల్ల చల్లటి వేడి వేడి నూనెలను గూడా ఆనందంగా ఆస్వాదిస్తాయి.  జిడ్డు తలకాయలు అంటే పేలకు పరమానందం. 

ఈ మధ్యే అమెరికా వెళ్ళిన ఒకావిడను,  పక్కింటి పిన్ని గారు మదేశం నుండి ఏం తెచ్చావమ్మ అంటే, తేవటానికి ఏవున్నాయి పేలు తప్ప గోక్కొలేక, పీక్కొలేక చస్తున్నాము అందిట. ఒకాయనయితే అమెరికా వాళ్ళు అనుమతి లేనీదే ఎవరిని ప్రవేశించనీరంటూ పేల నుండి తప్పించుకోటానికి  ఏకంగా పిల్లలకు గుండు కొట్టించి మరీ పట్టుకెళ్లాడు.  

అసలు యుగయుగాలుగా  పేలు మానవులను వెన్నంటి ఉండటానికి గవదనుగ్రహం లేకపోలేదు. నిత్య దేవతారాధనలో మనతో పాటు మమ అనుకున్నట్లుగా మనలను అంటిపెట్టుకొనికొని వుండటంవల్ల కాబోలు. పైగా పేల ధైర్యం ఏమిటంటే ఇతర క్రిమి కీటకాదుల మీద లాగా వాటికి హాని తలపెడితే మొదట పర్యవసానం అనుభవించాల్సింది మానవులే కాబట్టి.

పేలు దొరికిపోయిన  సమయంలో కూడా మానవులకు హాని చేసి తప్పించుకుందామని చూడవు. వారి చేతి బొటనవ్రేలి గోరుకిందపడి ఆనందంగా ప్రాణాలు విడుస్తాయి. ఆ చిన్న ప్రాణిని చంటానికి కూడా మానవుడు ఎంతో శక్తిని వుపయోగించాల్సి వుంటుంది.  మరే విధంగానూ పేలను మానవుడు చంపలేడు. ఈ జీవితం క్షణ భంగుర మని, ఏది వెంట రాదని, ఏది శాశ్వతం కాదని మానవుడు పేల నుంచే నేర్చుకోవాలి.

వెన్కట్రమ్ణ